కవి సిద్దార్థకు తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారం

0
15
views

సాహిత్య సృజనను గౌరవించే ఉద్దేశంతో తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. 2019 సంవత్సరానికి గాను కవిత్వ విభాగంలో కవి సిద్దార్థ రచించిన కవితా సంపుటి ” బొమ్మల బాయి”, వచన రచనల విభాగంలో 2016 లో ఉప్పల నరసింహం రచించిన కధల సంపుటి “మట్టి మనిషి”కి పురస్కారాలను దక్కాయి. బహుమతి కింద లక్ష నూట పదహారు రూపాయల నగదు, జ్ఞాపిక, ధ్రువపత్రం, శాలువాతో వారిని సన్మానిస్తారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2017లో తెలంగాణ సాహిత్య అకాడమీ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి తొలి చైర్మన్ గా నందిని సిధారెడ్డి ని నియమించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో 2017 డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించారు. కొత్త తరం కవులు, రచయితలను ప్రోత్సహించేందుకు ఈ సంవత్సరం నుండి సాహిత్య అకాడమీ అవార్డులను అందజేస్తున్నామని సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు.

LEAVE A REPLY