సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో టెలీమెడిసిన్ కార్యక్రమం: కిషన్‌ రెడ్డి

0
56
views

కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజలు ఇళ్లల్లో నుంచి ఎవరు బయటకు రాలేని పరిస్థితుల దృశ్య సాధారణ వైద్యసేవలు పొందేందుకు బీ.జె.పీ మెడికల్‌ సెల్‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో మెడికల్‌ పోర్టల్‌ (టెలీమెడిసిన్) కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి ప్రారంభించారు.

ఈ పోర్టల్ ద్వారా 9959261273 కి ఫోన్ చేస్తే డాక్టర్లు అందుబాటులోకి వచ్చి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. టెలీమెడిసిన్ విధానం ద్వారా రోగులు.. డాక్టర్ల సలహాలు, సూచనలు తీసుకుని మందులు వాడేందుకు దోహదపడుతుందని తెలిపారు. వయసు పైబడిన వారి కోసం బిజెపి వాలంటీర్లు మరియు మెడికల్ షాప్స్ వాలంటీర్లు మందులు తెచ్చి ఇవ్వడానికి సహాయం చేస్తారని తెలిపారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

LEAVE A REPLY