తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు

0
67
views

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర హైకోర్టు కు ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కూనూరు లక్ష్మణ్ గౌడ్, జస్టిస్ తడకమళ్ల వినోద్ కుమార్ నియమితులయ్యారు.

నిజానికి, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్‌లో పని చేస్తున్న సమయంలో 2018 అక్టోబరు 9వ తేదీన న్యాయవాదుల కోటాలో ఏపీ హైకోర్టుకు నలుగురిని, తెలంగాణ హైకోర్టుకు ముగ్గురిని హైకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అనంతరం, హైకోర్టు విభజన జరిగింది. న్యాయవాదుల కోటాలో వీరిని నియమించాలని పేర్కొంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత ఈ నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం జారీ చేశారు.

జస్టిస్ కూనూరు లక్ష్మణ్ గౌడ్

LEAVE A REPLY