కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి

0
8
views

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోహెడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు (ఏ. యం. సి.చైర్మన్) పెర్యాల దేవేందర్ రావ్ హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ,భారత స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలు మరువలేనివన్నారు. బాపూజీ ఆశయ సాధన కోసం అందరం బాపూజీ అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాపూజీ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించటం పట్ల వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉప్పల స్వామీ ,ఉప సర్పంచ్ యాదఅశోక్ కుర్మా , మాజీ సర్పంచ్ మంద రాజయ్య, మాజీ ఎంపీటీసీ తిప్పారపు నాగరాజు, పద్మశాలి సంఘం నాయకులు గోరీత్యాల వేణుగోపాల్ నేత, సుధాకర్ రావ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాపూజీ అనుచరులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY