బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి : శ్రీనివాస్ గౌడ్

0
12
views

బీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో ఓబీసీ జాతీయ మహాసభలో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో 85 మంత్రిత్వశాఖల ఉన్నాయని కానీ అరవై శాతం జనాభా ఉన్న బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు. బీసీల్లో ఐక్యమత్వం లేకపోవడమే వల్లే అధికారాలు కోల్పోవాల్సి వస్తుందని, బీసీ లందరు ఐక్యమత్యంగా ఉండి పోరాడి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం బీసీల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, బీసీ నిరుద్యోగులకు ఉపాధి హామీ పథకాలు, బీసీ స్టడీ సర్కిళ్ల నిర్వహణ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయిలో సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.

LEAVE A REPLY