ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు బిల్లుకు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు

0
13
views

లోక్‌సభలో కశ్మీర్ విభజన బిల్లుకు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు తెలిపింది. చ‌రిత్ర చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దాల్సిన అస‌వ‌రం ఉంద‌ని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అభిప్రాయ‌ప‌డ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా భారత్ వెంటనే స్వాధీనం చేసుకోవాలని నామా కోరారు.

ఇవాళ లోక్‌స‌భ‌లో నామా మాట్లాడుతూ క‌శ్మీర్ అభివృద్ధిలో అంద‌రం భాగ‌స్వామ్యులం కావాల‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌ల జీవితాలు మార‌నున్న‌ట్లు నామా అన్నారు. క‌శ్మీరీల జీవితాలు మారుతుంటే, అప్పుడు వాళ్ల‌కు అది చీక‌టి రోజు ఎందుకు అవుతుంద‌ని, ఇది వాళ్ల‌కు క్రాంతి దిన‌మ‌ని నామా స‌భ‌లో తెలిపారు.

సుంద‌ర క‌శ్మీరాన్ని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. బిల్లుతో జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించేవారిని ప్రజలు దేశ ద్రోహులుగా భావిస్తారని, అందుకే బిల్లుకు మ‌ద్ద‌తు ఇవ్వాల్సి ఉంద‌న్నారు.

LEAVE A REPLY