తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వీరేందర్‌ గౌడ్

0
73
views

తెలంగాణ తెలుగుదేశం తెలుగు యువత అధ్యక్ష్యుడు, యువ నేత తూళ్ల వీరేందర్ గౌడ్ పార్టీ సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్‌ గౌడ్‌ కుమారుడైన వీరేందర్‌ గౌడ్ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కి పంపారు.

ఉన్నత ఆదర్శాలు, సిద్ధాంతాలతో మహానేత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పుడు కేవలం రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలకు భిన్నంగా టీడీపీ వ్యవహరిస్తోందని, దీని వల్ల పార్టీలో కొనసాగలేకపోతున్నానని పేర్కొన్నారు. అక్టోబర్ 3న ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరేందర్ గౌడ్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

2014లో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వీరేందర్ గౌడ్, 2014లో ఉప్పల్‌ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించాడు, అప్పుడు పొత్తుల్లో భాగంగా మిత్రపక్షమైన బిజెపికి ఆ స్థానాన్ని కేటాయించారు. దింతో అప్పుడు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఉప్పల్ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యాడు.

LEAVE A REPLY