హుజూర్‌నగర్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి రెడ్డి

0
12
views

హుజూర్‌నగర్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. 2018లో అసెంబ్లీ కి జరిగిన ముందుస్తు ఎన్నికల్లో ఆమె కోదాడ నుండి ఓటమిపాలయ్యారు.

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. దీనితో ఆయన హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్‌ 21న పోలింగ్‌ జరగనుంది.

LEAVE A REPLY