జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా మమత

0
75
views

తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షురాలు వంకాయలపాటి మమత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) డిప్యూటీ కమిషనర్ నుంచి జోనల్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. అంతకు ముందు ఆమె శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ గా పని చేశారు. మమత పదోన్నతి పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో ప్రధానకార్యదర్శి మామిళ్ల రాజేందర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, పుల్లెంల రవీందర్‌కుమార్, గండూరి వెంకటేశ్వర్లు, వెంకటయ్య తదితరులు మమతను కలిసి అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY