ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌‌గా వాసిరెడ్డి పద్మ

0
10
views

ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. కృష్ణా జిల్లాకు చెందిన ఆమె 2011లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పటినుండి ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అంతకుముందు ఈ పదవిలో టిడిపి సీనియర్ నాయకురాలు నన్నపునేని రాజకుమారి ఉన్నారు, బుధవారం ఆమె రాజీనామా చేశారు.

LEAVE A REPLY