బతుకు ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం

0
25
views

రవీంద్రభారతిలో ‘బతుకు’ పేరిట యువ ఫోటోగ్రాఫర్ వినయ్ రెడ్డి మానుక తీసిన ఛాయాచిత్ర ప్రదర్శన ఆదివారం రోజున ప్రారంభమయింది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ విచ్చేసి ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు.

ఈ సందర్భంగా,మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి వేదికగా వివిధ కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగా యువ ఫోటోగ్రాఫర్ వినయ్ రెడ్డి మానుక తీసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఈరోజు ప్రారంభిస్తున్నామన్నారు. సినిమారంగం మీద ఆసక్తితో హైదరాబాద్ కి వచ్చిన వినయ్ తెలంగాణలోని వివిధ ప్రాంతాలు తిరిగి తెలంగాణ గ్రామీణ బతుకుచిత్రానికి సంబంధించిన ఫోటోలు తీసి ‘బతుకు’ అనే పేరుతో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటుచేసాడని పేర్కొంటూ, వినయ్ ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత కళాకృష్ణ, బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత మైమ్ మధు, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి నవీన్ ఆచారి, యువ దర్శకులు యెన్నెన్జీ పాల్గొన్నారు.అక్టోబరు7వ తేది వరకు ఈ ఛాయాచిత్ర ప్రదర్శన కొనసాగుతుంది.

LEAVE A REPLY